హల్చల్ చేస్తున్న బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్

తెలుగు జాతి కీర్తిని నలుదిక్కులా చాటిన ఘనత అన్న నందమూరి తారకరామారావు గారికి మాత్రమే దక్కుతుంది..తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతోందంటే దానికి కారణం ఎన్టీఆర్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..సినిమా జీవితం నుంచీ రాజకీయాల వైపు అడుగులు వేసి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు గడ్డపై పసుపు జెండాని రెపరెపలాడించిన ఒకేఒక్క వ్యక్తి ఎన్టీఆర్..ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది..ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది సినీ నటులు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు కూడా.

ఎన్నేళ్ళు గడిచినా కూడా ఆయన్ని తలవని రాజకీయ నాయకులు ఉండరు…ఇప్పటికీ రాజకీయాలు ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి…బయోపిక్ ల రూపంలో ఇప్పుడు అన్నగారి జీవిత చరిత్రని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు అనేకమంది దర్శకులు..అయితే వర్మ ఎన్టీఆర్ జీవితాన్ని అన్ని సంఘటనలు ఆధారంగా ఒక్క విషయం కూడా మిస్ కాకుండా తీస్తాను అని శపధం చేశాడ..ఇదిలా ఉంటే ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఆయన పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు కూడా. ఇదిలా ఉంటే బాలయ్య బాబు –తేజా కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్ ని రీసెంట్ గా విడుదల చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్ ని రీసెంట్ గా విడుదల చేశారు.

బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కించాలని తీస్తున్న ఈ సినిమాలో మొదట దర్శకుడుగా తేజా కాదు అనుకున్నా తరువాత తేజా ని ఫిక్స్ చేసేశారు..ఇప్పుడు తేజా దర్సకత్వంలో వస్తున్న ఈ బయోపిక్ పోస్టర్ బుధవారం రిలీజ్ చేశారు..” ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా జీవించిన ఓ మహానుభావునికి ఇదే మా నివాళి “అని ఆనాడు ఎన్టీఆర్ చెప్పిన మాటలను పోస్టర్లో పొందుపరిచారు.ఇది కేవలం పోస్టర్ మాత్రమే అసలు బాలయ్య ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీవ్ చేస్తాం అని తెలిపారు చిత్ర యూనిట్..ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తామా..బాలయ్య ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు అనే ఆత్రుతతో ఎన్టీఆర్ అభిమానులు అందరు వేచి చూస్తున్నారు.