ఈ కోడి మాంసం కిలో రూ.900 , కోడిగుడ్డు రూ.50…! ఈ కోడిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా..?

అప్పుడే పుట్టిన ఈ కోడి పిల్ల ఖ‌రీదు 150 రూపాయ‌లు….ఒక కోడికి ఇంత రేటు ఎందుకు అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ ఈ కోడి ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న కోడి మాములుగా మనం వారం వారం తినే కోడి మాంసం రేటు రూ.100 నుండి రూ.200 మధ్యలో ఉంటుంది, కోడి గుడ్లు మన చిన్నప్పుడు రూపాయికి ఒకటి వచ్చేది, ఇప్పుడైతే రూ.5 కి ఒకటి వస్తుంది, కానీ మన దేశంలో దొరికే క‌డ‌క్‌నాథ్ అనే జాతి కోడి మాంసం రేటు కిలోకి 900 రూపాయ‌లు, దాని కోడి గుడ్డు ఒక్క‌టి 50 రూపాయ‌లు దాకా ఉంటుంది.

ఈ కోడి పిల్లలను డిమాండ్ ని బట్టి రూ.150 నుండి రూ.200 వరకు అమ్ముతారు. ఈ కోడి రూపంలో పూర్తిగా నలుపు రంగులోనే ఉంటుంది, కోడి గుడ్లు మాత్రం పెద్దగా ఉండి తెలుపు, ఎరుపులు కలిసిన రంగులో ఉంటాయి.మ‌ద్య ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ఈ కోడి జాతి పేరు క‌డ‌క్‌నాథ్ …ఎన్నో రోగాల‌ను త‌గ్గించే శ‌క్తి ఈ కోడి మాంసంలో ఉండ‌డం విశేషం. ఈక‌ల‌తో స‌హా, మాంసం, గుడ్ల వ‌ర‌కు టోట‌ల్ గా బ్లాక్ క‌ల‌ర్ లో ఉండే ఈ కోడి పోష‌కాలు గ‌ని అని చెప్ప‌వ‌చ్చు. క‌డ‌క్‌నాథ్ కోడి ప్రత్యేకతలు:ఈ కోడి మాంసం తిన‌డం వ‌ల్ల‌ జీర్ణ శక్తి, రోగ నిరోధక శక్తులు పెరుగుతాయి.క‌డ‌క్‌నాథ్ జాతి కోళ్ల మాంసంలో కొవ్వు చాలా త‌క్కువ‌గా ఉంటాయి.

ఈ కోళ్ళలో మాంస‌కృత్తులు ఎక్కువ‌గా ఉంటాయి. ఔష‌ద గుణాలు అధికంగా ఉండ‌డం వ‌ల్ల‌, మెడిసిన్స్ లో ఈ కోడి మాంసం విరివిగా వినియోగించ‌బ‌డుతుంది.ఏడు నెల‌ల్లో 1.5 కేజీల బ‌రువు మాత్ర‌మే పెరుగుతుంది. క్రీడాకారుల‌కు ఇచ్చే ఆహారంలో లో ఈ కోడి మాంసంని చేర్చ‌ల‌నే డిమాండ్ కూడా ఉంది.ఈ కోడి పెట్టే గుడ్డు, మాంసం కూడా పూర్తిగా నలుపు రంగులోనే లోనే ఉండ‌డం విశేషం.

క‌డ‌క్‌నాథ్ జాతి కోళ్లు ఎక్కువగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దొరుకుతాయి, ఈ మధ్య కాలంలో చాలా చోట్ల ప్రత్యేక షెడ్లని వేసి ఈ జాతి కోళ్ళని పెంచుతున్నారు, మన తెలుగు రాష్ట్రాలలో కూడా హైదరాబాద్ , విజయవాడ శివార్లలో పెంచుతున్నారు, ఈ కోళ్ల మాంసం తినడం ఆరోగ్యానికి మంచిది కావడంతో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది.