జనసేన మహిళా విభాగం స్టార్ట్..పేరు ఇదే

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్పీడు పెంచేశారు..అజ్ఞాతవాసి పరాజయం తరువాత పవన్ స్పీడు తగ్గిందని రాజకీయాల్లో కూడా ఈ స్పీడు తగ్గుతుందని అందరు కామెంట్స్ చేశారు..అయితే తెలంగాణా కొండగట్టు ఆంజనేయ స్వామి చెంతనుంచీ నా రాజకీయ యాత్ర మొదలవుతుంది అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ యాత్రని ప్రారంభించారు..అయితే అంతకంటే ముందు గా పవన్ జనసేన పార్టీ మహిళా విభగాన్నీ సిద్దం చేశారు..

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన ప్రత్యేక మహిళా విభాగాన్ని సోమవారం ప్రారంభించారు…ఈ విభాగానికి “ వీరమహిళ ” పేరు పెట్టారు సోషల్ మీడియా బృందాన్ని ఈ పేరుతో ఏర్పాటు చేసినట్లు పవన్ కళ్యాణ్ తన ప్రజా యాత్ర సందర్భంగా తెలిపారు.అయితే ఈ విభాగంలో ఎవరైనా అంకిత భావంతో పని చేయవచ్చు అని తెలిపారు..

“వీర మహిళా” విభాగంలో క్రియాశీలక సభ్యులుగా పనిచేయడానికి ముందుకు వచ్చిన మహిళలకు ఆయన అభినందనలు తెలిపారు. దేశాభివృద్ధిలో మనవంతు పాత్ర పోషిద్దామని పవన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎవరి నియమిస్తారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.