మీ గురించి గూగుల్ చెప్పేస్తుంది.. సరికొత్త యాప్!

ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ వాడకం చాలా ఎక్కువైందనే చెప్పాలి. దానికి తోడు ఇంటర్నెట్ అందరికి తక్కువ ధరకే అందుబాటులోకి రావడం చాలా ప్లస్ అయ్యింది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. మనం ఎప్పుడైనా అతి ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు సడన్ గా ఫోన్ అదే పనిగా రింగ్ అయితే చాలా చిరాకొస్తుంది. ఒకవేళ తెలియకుండా పనిలో పడి మొబైల్ లిఫ్ట్ చేయకుంటే కావాలనే లిఫ్ట్ చేయడం లేదు అనే అనుమానాలు అవతలి వ్యక్తికి కలుగుతుంటాయి.

మనం ఏం చేస్తున్నాం ఎంత బిజీగా ఉన్నాం అనే విషయం అవతలి వ్యక్తికి తెలిస్తే రిలేషన్ డ్యామేజ్ అండ్ టెన్షన్ తగ్గుతుంది. అయితే ఆ తరహాలో ఉండాలని గూగుల్ ఒక సరికొత్త రిప్లై యాప్ ని డెవెలప్ చేస్తోంది. మనం ఒకవేళ డ్రైవింగ్ లో ఉంటే అవతలి వ్యక్తికి తెలిసేలా ఆ యాప్ తన పని చేస్తుంది. డ్రైవింగ్ మోడ్ ఆన్ చేసినప్పుడు కాల్స్ వస్తే వెంటనే అవతలి వ్యక్తికి ‘మీరు ఫోన్ చేస్తోన్న పర్సన్ డ్రైవింగ్ లో ఉన్నాడు’ అని మెస్సేజ్ వెళుతుంది. ఇక మనం ఎప్పుడు బిజీగా ఉంటామో ఆ తేదీని క్యాలెండర్ లో సెట్ చేసుకుంటే ఎవరైనా ఆ తేదీ నాడు వేరే చోటుకు వెళదాం అంటే కూడా రిప్లై యాప్ అతనికి సందేశాన్ని ఇస్తుంది.

ఉదాహరణకు వచ్చే శుక్రవారం మీరు ఇంటర్వ్యూకి వెళ్లాలని క్యాలెండర్ లో సెట్ చేసుకున్నారు అనుకోండి. అప్పుడు మీ స్నేహితుడు ఫ్రైడే సినిమాకు వెళదామా? అంటే వెంటనే అతనికి ఆ రోజు మీరు బిజీ అని రిప్లై వెళుతుంది. కేవలం మన సెట్టింగ్స్ పైనే ఈ యాప్ రన్ అవుతుంది. ప్రస్తుతం రిప్లై యాప్ మొత్తంగా పూర్తయ్యింది. గూగుల్‌ బీటా టెస్టర్లకు ఈ యాప్‌ను టెస్ట్ కి పంపింది. త్వరలోనే అందరికి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, స్కైప్‌, ఆలో, హ్యాంగవుట్‌ , ఆండ్రాయిడ్‌ మెసేజెస్‌ లలో ఇది పని చేస్తుంది.