ప్రియుడితో వధువు జంప్.. ట్విస్ట్ ఇచ్చిన వరుడు !

పెళ్లి అనగానే ఏ కుటుంబంలో అయినా ఎప్పుడు లేని విధంగా సంబరాలు మొదలవుతాయి. కానీ ప్రస్తుత రోజుల్లో జరుగుతోన్న కొన్ని ఘటనల గురించి వింటే..కొందరి కారణంగా పెళ్లిళ్లకు వాల్యూ లేకుండా పోతుందా అనే అనుమానాన్ని కలిగిస్తోంది. పెళ్లి ఇష్టలేకుండా చేస్తున్నారని వదువరులలో ఎవరో ఒకరు పారిపోతుండడం అప్పుడపుడు జరిగే పరిణామాలే. అయితే రీసెంట్ గా జరిగిన ఘటన గురించి వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. పెళ్లి కూతురి ప్రియుడితో పారిపోతే.. ప్రియుడు కూడా తన ప్రియురాలితో జంప్ అయిపోయాడు. మధ్యలో మరొక ట్విస్ట్ కూడా ఉంది.

తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా చిన్నకల్లులో జరిగింది. శనివారం రోజు వదువరులకు నిశ్చితార్ధం చేసి ఆదివారానికి పెళ్లి చేయాలనీ పెద్దలు నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండడంతో వధువు తన ప్రియుడితో జంప్ అయిపొయింది. అయితే పెళ్లి ఆపితే పరువు ఏం కావాలని మగపెళ్లి వారు ఆగ్రహించడంతో వధువు చెల్లెలితో పెళ్లి చేయాలనీ పెద్దలు నిర్ణయించారు. కానీ పెళ్లి కొడుకు షేవింగ్ చేసుకొస్తాను అని చెప్పి మళ్లీ తిరిగిరాలేదు. దీంతో అతను కూడా తన ప్రియురాలితో వెళ్లిపోయాడని సన్నహితుల నుంచి వార్తలు వచ్చాయి. అయితే మరికొందరు మాత్రం పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయాడని చెబుతున్నారు.