కత్తి మహేష్ పై దాడి వెనక నిజాలు ఇవేనా?

కత్తి మహేష్ పై మళ్లీ దాడి జరిగింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అంటే చాలు.. అంతెత్తున ఎగిరి పడుతున్న అతనిపై.. తాజా దాడి కూడా పవన్ కల్యాణ్ అభిమానులదే అన్నది కొందరి వాదన. అంతెందుకు.. కత్తి మహేష్ కూడా ఇదే చెబుతున్నాడు. ఇన్నాళ్లూ.. తన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ జవాబు చెబితే చాలు అన్న అతను.. ఇప్పుడు పవన్ కల్యాణ్ తనకు క్షమాపణ చెప్పాల్సిందే అనే స్థాయికి తన మాటల దాడిని తీవ్రం చేశాడు. అందుకు.. తాజా దాడిని కూడా

ఉపయోగించుకుంటున్నాడు.ఓ వైపు.. కత్తి మహేష్ వాదనను సమర్థిస్తున్నవాళ్లు ఉంటే.. తప్పుబడుతున్న వాళ్లు కూడా అంతే మంది కనిపిస్తున్నారు. ఈ దాడిని.. పవన్ కల్యాణ్ అభిమానులు చేశారనేందుకు ఆధారాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. కత్తి మహేష్ అనుకూలురే.. ఈ దాడి చేసి ఉండరన్న గ్యారెంటీ ఏంటని అడుగుతున్నారు. కోన వెంకట్ తో పాటు.. మరికొందరు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటుంటే.. దాన్ని ఇప్పట్లో ఆపడం ఇష్టం లేని వాళ్లే ఇలాంటి ప్రయత్నాలకు తెగబడుతుండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ వ్యవహారంలో పవన్ కల్యాణ్ అభిమానులది తప్పే. కాదని ఎవరూ అనరు. కానీ.. అందుకు కత్తి మహేష్ వ్యవహార శైలి కూడా కారణమే అనే వాళ్లు కూడా ఉన్నారు. రెండు వైపులా తప్పు ఉన్నపుడు.. అటు పవన్ ఫ్యాన్స్, ఇటు కత్తి మహేష్ అంగుళం కూడా వెనక్కు తగ్గే పరిస్థితి లేనపుడు.. ఎవరూ ఎవర్నీ ఆపలేరు. ఇప్పటికే ఈ విషయాన్ని సినీ ప్రముఖులు చాలా మంది చెబుతూ వస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఇదే మొత్తుకుంటున్నారు.

కానీ.. వినేదెవరు? ఆవేశాన్ని అదుపులో పెట్టుకునేదెవరు? నువ్వు ఒకటంటే.. నేను రెండంటా.. నువ్వు రెండంటే.. నేను నాలుగంటా.. అన్నట్టుగా వ్యవహారశైలి ఉంటే.. సమస్య రగలడమే తప్ప.. చల్లారడం అనేది ఉండదు. ఇదే.. కత్తి మహేష్ పై తాజా దాడికి కారణమై ఉంటుందన్నది.. విశ్లేషకుల అభిప్రాయం. ఇందులో తప్పు కత్తి మహేష్ దైనా.. పవన్ కల్యాణ్ అభిమానులదైనా.. ఇబ్బంది పడేది మాత్రం.. మామూలు ప్రజలే. ఈ విషయం.. వివాదాలకు కేరాఫ్ గా ఉన్నవారికి ఎప్పుడు అర్థమవుతుందో.. ఏమో.