టాప్‌ స్మార్ట్‌ఫోన్లపై ఆన్‌లైన్‌ దిగ్గజాల భారీ డిస్కౌంట్లు

ప్రముఖ ఆన్‌లైన్‌ కంపెనీలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో డిస్కౌంట్‌ సేల్‌ సందడి మొదలైంది. ముఖ్యంగా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌, ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్‌ డే సేల్‌ పేరుతో ఈ రెండు దిగ్గజాలు స్పెషల్‌ సేల్‌ ప్రారంభించాయి. ఈ విక్రయాల్లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌ ధరలను ఆఫర్‌ చేస్తున్నాయి. సరసమైన ధరల్లో టాప్‌ఎండ్‌ స్మార్ట్‌ఫోన్లను దక్కించుకునే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది. జనవరి 21నుంచి 23 దాకా ఈ స్పెషల్‌ సేల్‌ అందుబాటులో ఉండనుంది.

ఐఫోన్ ఎక్స్‌, గెలాక్సీ ఎస్‌ 7 ఎడ్జ్‌, హానర్ 8 ప్రో,ఎల్‌జీ జీ6, ఎంఐ మిక్స్‌ 2, డివైస్‌లపై టాప్‌ డిస్కౌంట్‌ అందిస్తున్నాయి. రిపబ్లిక్ డే సేల్‌ లో ఐఫోన్ 7, గెలాక్సీ ఎస్‌7, ఒప్పో ఎఫ్‌3 లపై కూడా డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. వీటితో గూగుల్‌ పిక్సెల్‌, లెనోవా స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపును అందుబాటులో తెచ్చాయి. ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ 64జీబీ: గత ఏడాది నవంబరులో లాంచ్‌ అయిన ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ రూ.84,999 లకే లభ్యం, (అసలు ధర రూ. 89వేలు) అలాగే 18 వేల రూపాయల దాకా ఎక్సేంజ్‌ ఆఫర్‌. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ (32జీబీ నిల్వ): ఈ ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ రూ .35,990 కు లభ్యం. అసలు ధర రూ .41,900. అలాగే రూ.18వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ హానర్ 8 ప్రో (128జీబీ/ 6జీబీర్యామ్‌): ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందిస్తున్న17శాతం దాగా డిస్కౌంట్‌తో ప్రస్తుతం ఇది రూ.24,999కి లభ్యం. (అసలు ధర రూ.29,999)

ఎల్‌జీ జీ 6: బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లే, డ్యుయల్‌ రియర్‌ కెమెరాలతో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ ఏకంగా 45 శాతం తగ్గింపు ధరలో ఆఫర్‌ చేస్తోంది. రూ.55,500కు లాంచ్‌ కాగా ప్రస్తుతం ఇది కేవలం రూ. 29,990 లకే లభ్యంకానుంది. షావోమి ఎంఐ మిక్స్ 2: షావోమి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ మిక్స్ 2 ఫ్లిప్‌కార్ట్‌ 29,990లకే అందిస్తోంది. గరిష్టంగా 21వేల రూపాయల ఎక్సేంజ్‌ ఆఫర్‌ కూడా. వీటితోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఇతర స్మార్ట్‌ఫోన్లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు వీటి అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించగలరు.