అనుష్క భాగమతి సెన్సార్ రిపోర్ట్

అనుష్క టైటిల్ రోల్ పోషించిన భాగమతి విడుదలకు సర్వం సిద్ధం అయ్యింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ తీసుకుంది. రన్ టైం మొత్తం 142 నిముషాలు. మరీ ల్యాగ్ అనిపించకుండా మొత్తం 2 గంటల 22 నిమిషాల వ్యవధిలోనే భాగమతి విశ్వరూపం చూడబోతున్నాం. అరుంధతి తర్వాత అంత పవర్ ఫుల్ రోల్ లో అనుష్కను చూడలేదే అని ఫీల్ అవుతున్న స్వీటీ ఫాన్స్ కోరిక తీర్చేలా ఈ సినిమా ఉండబోతోంది అని టాక్.

ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయం, అనుష్క-ఉన్ని ముకుందన్ మధ్య ప్రేమ కథతో సాఫీగా నడిపిన దర్శకుడు ప్రీ ఇంటర్వెల్ నుంచి అసలు కథలోకి తీసుకువెళ్తాడట. కలెక్టర్ గా గ్రామానికి మంచి చేయాలనీ వచ్చిన అనుష్కను విలన్లు ప్లాన్ చేసి మరీ ఒంటరిగా ఆ బంగాళాలో పారేస్తారు. ఒక కీలకమైన రహస్యం తన నుంచి రాబట్టడం కోసం అక్కడ సిసి కెమెరాలు కూడా ఫిక్స్ చేసి ఉంటారు. కాని ఊహించని రీతిలో అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి.

దీన్ని చేధించేందుకు మురళి శర్మ టీంకూడా అందులోకి వెళ్తుంది. అనూహ్యమైన మలుపుల తర్వాత ఆ బంగాళా మహారాణి భాగమతి బయటికి వస్తుంది.ఆసలు ఆమె ఎవరు, చనిపోయాక కూడా అక్కడే ఎందుకు ఉంది అనే పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ లో అనుష్క విశ్వరూపం చూడొచ్చని టాక్. ఒక ఇరవై నిమషాల పాటు తన స్క్రీన్ ప్లే తో దర్శకుడు అశోక్ మొత్తం ఇంప్రెషన్ అక్కడే కొట్టేసాడని తెలిసింది.

మరి అంత సూపర్ ఫ్లాష్ బ్యాక్ ఏముందో తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సంక్రాంతి సినిమాల సందడి జనవరి 26కంతా పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి భాగమతికి పోటీ భయం లేదు. వస్తాయనుకున్న అభిమాన్యుడు, ఆచారి అమెరికా యాత్ర ఇప్పటి దాకా సైలెంట్ గా ఉన్నాయి. సో పద్మావత్, ప్యాడ్ మ్యాన్ తో మాత్రమే స్వీటీకి పోటీ. సందీప్ కిషన్ మనసుకు నచ్చింది కూడా ఉంది కానీ భాగమతికి ధీటుగా నిలిచే సీన్ అయితే ప్రస్తుతానికి లేదు.